Monday, 26 September 2011

Poverty story from a Telugu Poet PEN

చిన్ని చిన్ని కోరికలు -పెద్ద భూతం

అమ్మ ఒడిలో హాయిగా పడుకోవాలనుంటుంది.........
అలసి సొలసి భూమాత గుండెలపై నిదరోతాడు!!

మిఠాయి కొట్లో తెల్లని మిఠాయి తినాలనుంటుంది........
మంచినీళ్ళు పోసి ఆ ఆశను పాతిపెడతాడు!!

పుస్తకాల సంచితో బడికి పోవాలనుంటుంది........
చిత్తు కాగితాలేరుకుని సంబర పడతాడు !!

సైకిలెక్కి ఊరంతా తిరగాలనుంటుంది........
కలలో దాన్ని తొక్కడం రాక తికమకపడతాడు!!

సంతోషం తో గట్టిగా నవ్వాలనుంటుంది.......
అది ఎలాగో తెలీక కన్నీళ్లు పెడతాడు !!

ఆ పెద్దింట్లో వాళ్ళలా బొమ్మల సినిమా చూడాలనుంటుంది......
నాన్నొచ్చి అమ్మని కొట్టే పాత సినిమానే రోజూ చూస్తాడు !!

ఆ ఇంట్లో అబ్బాయిలా కొత్త బట్టలు వేసుకోవాలనుంటుంది.........
కాని చిరుగుల లాగు వాడి వైపు జాలిగా చూస్తుంది !!

బ్యాటిచ్చుకుని బాలుని గట్టిగా కొట్టాలనుంటుంది.......
ఆడే వాళ్ళని చూసి ఆనందం తో సరిపెడతాడు !!

కొందరిలా తామెందుకు హాయిగా లేమో తెలుసుకోవాలనుంటుంది.....
కానీ ఎంత ఆలోచించినా ఆ చిన్ని బుర్రకు అర్ధం కాదు !!

పేదరికం అనే పెద్ద భూతం ఒకటుందని .......
అది కరుకు పాదాలతో తన లేతమనసును తొక్కిచంపేస్తుందని
పెద్దయ్యాక గానీ తెలియదు పాపం ఆ పేద గుండెకు !!!!!!!!!

No comments:

Post a Comment